Telugu Gateway
Telangana

తెలంగాణ బడ్జెట్ 1, 74,453 కోట్లు

తెలంగాణ బడ్జెట్  1, 74,453 కోట్లు
X

ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉన్న వేళ తెలంగాణ సర్కారు తుది పూర్తి స్థాయి బడ్జెట్ ను గురువారం నాడు శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2018-18 ఆర్థిక సంవత్సరానికి మొత్తం తెలంగాణ బడ్జెట్ 1, 74,453 కోట్లుగా ఉంది. గత నాలుగేళ్లుగా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారీ కూడా అదే మోడల్ ను అనుసరించింది. ఈటెలకు ఇది వరుసగా ఐదో బడ్జెట్‌. శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 1, 74,453 అయితే ఇందులో రెవెన్యూ వ్యయం 1,25,454 కోట్ల రూపాయలు అయితే..మూలధన వ్యయం 33,369 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పలు అంశాలు వెల్లడించారు.

రాష్ట్ర జీడీపీ ప్రతి ఏటా పెరుగుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అత్యంత కీలకమైక రైతుపెట్టుబడి సాయం 2018-19 నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఈ పథకం కింద ఎకరానికి రూ.8000 పెట్టుబడి సాయం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ సర్కారు రికార్డు స్థాయిలో వంద రోజుల్లోనే భూ రికార్డులను ప్రక్షాళన చేసిందని తెలిపారు. నీటిపారుదల రంగానికి వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను 25 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. రైతు పెట్టుబడి సాయానికి 15 వేల కోట్ల రూపాయలు పెట్టారు.

Next Story
Share it