Telugu Gateway
Politics

కర్ణాటక కాంగ్రెస్ దే..బిజెపికి షాక్

కర్ణాటక కాంగ్రెస్ దే..బిజెపికి షాక్
X

దక్షిణాదిలో పాగా వేసేందుకు ప్లాన్స్ వేసుకుంటున్న బిజెపికి షాక్ తప్పేలా లేదు. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి షాక్ తప్పదనే సర్వే లు చెబుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సమాచారం. ఇది ఖచ్చితంగా బిజెపికి ఏమాత్రం మింగుడుపడని పరిణామమే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం మాత్రమే కాకుండా తనకు సీట్లను కూడా పెంచుకోనుందట. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ దాదాపు 126 సీట్లు దక్కించుకోనుందని ఓ సర్వే తెలిపింది. 2013 ఎన్నికల సమయంలో సర్వే నిర్వహించి ఎన్నికల ఫలితాలు ముందే ఊహించి చెప్పిన సీ-ఫోర్స్‌ అనే సంస్థ తాజాగా మార్చి 1 నుంచి 25 వరకు సర్వే నిర్వహించింది.

దాదాపు 154 నియోజకవర్గాల్లో 22,357మంది ఓటర్ల వద్ద ఆరా తీసింది. 2013 కూడా సీ ఫోర్‌ అనే సంస్థ సర్వే చేసి ఆ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి 119 నుంచి 120సీట్లు వస్తాయని చెప్పగా చెప్పిన ప్రకారమే 122 స్థానాలు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈసారి కాంగ్రెస్‌ 126 స్థానాలు దక్కించుకుంటుందని, గతంతో పోలిస్తే నాలుగు స్థానాలు పెరుగుతాయని తెలిపింది. అంతేకాకుండా కాంగ్రెస్‌కు మొత్తం 9శాతం ఓట్లు పెరుగుతాయని, 46శాతం ఓట్లు కొల్లగొడుతుందని, అదే సమయంలో బీజేపీకి 31శాతం ఓట్లు, జేడీఎస్‌కు 16శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇతరుకు మాత్రం ఒక సీటు వచ్చే అవకాశం ఉందని, వారికి 7శాతం ఓట్లు వెళతాయని తెలిపింది.

Next Story
Share it