Telugu Gateway
Andhra Pradesh

బయటపడిన ‘బాబు అసలు రంగు’!

బయటపడిన ‘బాబు అసలు రంగు’!
X

‘బిజెపితో పొత్తు వల్ల మనకు ఒరిగింది ఏమీలేదు. ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాట. మరి రాజకీయంగా...రాష్ట్రానికి ఆర్థికంగా ఏ మాత్రం ఉపయోగంలేని బిజెపిని పట్టుకుని తెలుగుదేశం పార్టీ ఇంకా ఎందుకు వేలాడుతున్నట్లు?. ఓ వైపు రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన సాయం కూడా చేయటంలేదని నాలుగేళ్ళ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు. నిజంగా బిజెపితో పొత్తు వల్ల టీడీపీకి మేలు జరగలేదా? అంటే 2014 ఎన్నికల సమయంలో మోడీ ఇమేజ్ కు రాజకీయంగా కలిసొచ్చిన ప్రధాన అంశాల్లో ఒకటి. అది ఒక శాతం ఉంటుందా?.అర శాతం ఉంటుందా? అన్న విషయం పక్కన పెడితే టీడీపీ గెలుపులో మోడీ ఇమేజ్ టీడీపీకి ఖచ్చితంగా కలిసొచ్చిన అంశాల్లో ఒకటని చెప్పకతప్పదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకోవటానికి ప్రధాన కారణం రాజకీయ ప్రయోజనాలు ఫస్ట్ అయితే...రాష్ట్ర ప్రయోజనాలది రెండవ స్థానమే అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

ప్రధాని మోడీ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సర్కారు చేస్తున్న దుబారా వ్యయంపై మొదటి నుంచి సీరియస్ గానే ఉంది. ఉదాహరణకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ బాధ్యతను ఏపీ సర్కారు కోట్లాది రూపాయలు వెచ్చించి ముంబయ్ కు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించింది. రాజధాని శంకుస్థాపన ఈవెంట్ మేనేజ్ మెంట్ కు సంబంధం ఏమిటని..పీఎంవో సీరియస్ అయి..ఇలా అయితే ప్రధాని రారని చెపితే అప్పట్లో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దేశ ప్రధాని తరహాలో చంద్రబాబు సింగపూర్ కు ఏకంగా ప్రత్యేక విమానంలో వెళ్లిన ఘటనపై కూడా పీఎంవో అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు కష్టాల్లో ఉన్నామని చెబుతూ చంద్రబాబు చేస్తున్న దుబారా వ్యయంపై మోడీ సర్కారు మొదటి నుంచి సీరియస్ గానే ఉంది. ప్రత్యేక హోదా రాదనే విషయం తెలుగుదేశం ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి వాళ్ళే మూడేళ్ల క్రితం నుంచి బహిరంగంగానే చెబుతున్నారు. ఆ సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ప్యాకేజీ పాట పడి...అసలు ఏ రాష్ట్రానికి చేయని సాయం కేంద్రం ఏపీకి చేసిందని ప్రకటించారు.

తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రజల్లోకి ప్రత్యేక హోదా బలంగా వెళుతుందని గ్రహించి..చంద్రబాబు సీన్ రివర్స్ చేశారు. ఇందులో కూడా ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నది సుస్పష్టం. మరి మంత్రులతో రాజీనామా చేయించిన చంద్రబాబు..ఇంకా ఎన్డీయేలో ఉన్నామని చెప్పటం వెనక మతలబు ఏమిటి?. ఉపయోగంలేని బిజెపితో ఎందుకు అంటకాగుతున్నట్లు?. పోలవరంతోపాటు రాజధాని అమరావతి అయినా బిల్లులో ఉన్న అంశాలే కదా?. కేంద్రం వాటిని ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను కూడా సాధించుకోలేమని ‘ఫార్టీ ఇయర్స్’ ఇండస్ట్రీ చంద్రబాబు భయపడుతున్నారా?. ఎందుకీ డబుల్ గేమ్?. వాడుకుని వదిలేశారన్న పవన్ కళ్యాణ్ మాటలను మరోసారి తన వ్యాఖ్యల ద్వారా నిజం చేశారు.

Next Story
Share it