Telugu Gateway
Andhra Pradesh

జనసేనలోకి సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ

జనసేనలోకి సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ
X

జగన్ అక్రమాస్తుల కేసును డీల్ చేసిన సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆయన పవన్ కళ్యాన్ నెలకొల్పిన ‘జనసేన’లో చేరటానికి రెడీ అయిపోయారు. రాజకీయ ఎంట్రీ కోసం ఆయన స్వచ్చంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఆయనకు ఏడేళ్ల సర్వీసు ఉంది. లక్ష్మీనారాయణకు పవన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సర్వీసులో ఉండటంతో ఆయన తెరవెనక ఉండి పవన్ కు పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు సమాచారం. జనసేనలో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం. గత కొన్ని రోజులుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ..పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. లక్ష్మీనారాయణతో పాటు రాబోయే రోజుల్లో జనసేనలోకి పలువురు కీలక వ్యక్తులు చేరే అవకాశం ఉందని సమాచారం.

Next Story
Share it