Telugu Gateway
Telangana

ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్ పోర్టు ఏదో తెలుసా!

ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్ పోర్టు ఏదో తెలుసా!
X

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల పాస్ పోర్టులకు ర్యాంకింగ్స్ ఉంటాయి. వాటి ఆధారంగానే ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్ పోర్టు ఏదో తేలుస్తారు. తాజాగా 2018 గ్లోబల్ పాస్ పోర్టు ఇండెక్స్ వచ్చింది. దీని ప్రకారం ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్ పోర్టులుగా దక్షిణ కొరియా, సింగపూర్ నిలిచాయి. ఈ రెండు పాస్ పోర్టులు 162 పాయింట్ల స్కోర్ తో అగ్రభాగాన నిలిచాయి. జర్మనీ, జపాన్ లు రెండవ స్థానంలో నిలిచాయి. అగ్రరాజ్యాలైన యునైటెడ్ కింగ్ డమ్, అమెరికా పాస్ పోర్టులు వరసగా నాలుగు, ఐదవ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పవర్ ఫుల్ పాస్ పోర్టులు ఉన్న దేశాలకు చెందిన వ్యక్తులు వీసాలు అవసరం లేకుండానే నేరుగా పలు దేశాలను సందర్శించవచ్చు. ఎందుకంటే ఆయా దేశాల పాస్ పోర్టులకు అంత పవర్ ఉంటుంది. భారత్ పాస్ పోర్టు ఈ జాబితాలో 73వ ప్లేస్ కు పడిపోయింది. సౌదీ అరేబియా, జింబాబ్వే కంటే భారత్ పాస్ పోర్టు ర్యాంక్ కిందకు పడిపోవటం గమనార్హం. ప్రతి ఏటా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని పాస్ పోర్టులకు ర్యాంకింగ్స్ కేటాయిస్తుంటారు.

Next Story
Share it