Telugu Gateway
Andhra Pradesh

‘టచ్ చేసి చూడు’ బాబూ అంటున్న మోడీ

‘టచ్ చేసి చూడు’ బాబూ అంటున్న మోడీ
X

సింగపూర్ సంస్థల ‘స్విస్ ఛాలెంజ్’ కుంభకోణం. పోలవరంలో స్కాం. ఏఏఐ టెండర్ అడ్డగోలుగా రద్దు. ఆర్థిక పరిస్థితిపై దొంగ లెక్కలు. సాగునీటి శాఖలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు. ఫైబర్ గ్రిడ్ కుంభకోణం. అమరావతి టెండర్లలో గోల్ మాల్. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్క ఇప్పట్లో తేలదు. ఇన్ని కుంభకోణాలు పెట్టుకుని ప్రధాని మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గట్టిగా ప్రశ్నించగలరా?. అంటే ఛాన్సే లేదు అంటున్నాయి టీడీపీ వర్గాలు. బడ్జెట్ ప్రకటన వచ్చిన రోజు రెచ్చిపోయి చంద్రబాబు పేరుతో లీకులు అయితే ఇచ్చారు కానీ...ఇప్పుడు మాత్రం సమస్య పరిష్కారం అంత సులభం కాదని..ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుందని చంద్రబాబు చెబుతున్నారు. మంత్రులు...ఎంపీలు దూకుడుగా ప్రకటనలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం వాళ్ళను నియంత్రిస్తున్నట్లు కలరింగ్. కేంద్రంలోని బిజెపి నేతలు అయితే టీడీపీ ఎంపీలు..చంద్రబాబు లీకులను చాలా లైట్ తీసుకుంటున్నట్లు కన్పిస్తోంది. ఏపీ అడిగినవి అన్నీ ఇఛ్చేశామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ బిజెపి నేతలతో అన్నట్లు వార్తలు వచ్చినా కూడా టీడీపీ ఇంకా వేచిచూసే ధోరణితోనే ముందుకు సాగుతుంది.

అయితే అంశం ఏదైనా నిర్ణయం వేగంగా తీసుకోవటం అన్నది చంద్రబాబు చరిత్రలో ఉండదు. వీలైనన్నీ రోజులు ఈ అంశంపై మీడియాను అడ్డం పెట్టుకుని చర్చ నడిపించటం ద్వారా ప్రజల్లో సానుభూతి కొట్టేసి..ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తారే తప్ప..వేరే యోచన చంద్రబాబు చేయరు. ఎందుకంటే బిజెపిని ఎంత మేర వీలైతే అంత మేర బద్నాం చేయగలిగితే రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో అది టీడీపీకి లాభించనుంది. చంద్రబాబు రాత్రింబవళ్ళు కష్టపడ్డా..కేంద్రం..బిజెపి సాయం లేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాకపోయినా..ఎన్నికల నాటికి టీడీపీ-బిజెపి పొత్తుకు రాం రాం చెప్పక తప్పని పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం హంగామా చేస్తున్నా చంద్రబాబు సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. మోడీని టచ్ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అందరికంటే చంద్రబాబుకే బాగా తెలుసు.

Next Story
Share it