Telugu Gateway
Cinema

‘తొలి ప్రేమ’ రికార్డు వసూళ్ళు

‘తొలి ప్రేమ’ రికార్డు వసూళ్ళు
X

మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళుతున్న ‘తొలి ప్రేమ’ వసూళ్ళలో రికార్డులు సాధిస్తూ ముందుకెళుతోంది. వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకు పరిశ్రమ ప్రముఖుల నుంచి అందరి దగ్గరి నుంచి ప్రశంసలు దక్కిన విషయం తెలిసిందే. దీంతో అదే స్థాయిలో వసూళ్ళు వస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.25.8 కోట్ల గ్రాస్, రూ.14.6 కోట్ల షేర్ ను రాట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ మొత్తం సుమారు రూ. 10.77 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల దిశగా అడుగులు వేస్తున్నారట. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మంచారు. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. మరికొంత కాలం ఈ సినిమా వసూళ్లు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు.

Next Story
Share it