Telugu Gateway
Cinema

‘శ్రీదేవి’ ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు

‘శ్రీదేవి’ ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు
X

అందరూ ఊహిస్తున్నట్లు ప్రముఖ నటి శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదా?. అంటే అవుననే అంటోంది ఫోరెన్సిక్ నివేదిక. అయితే ఈ నివేదికలో శ్రీదేవి కొంత మోతాదులో మద్యం సేవించి ఉన్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో ఆమె ప్రమాదం కారణంగానే చనిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు. బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు పడిపోయి..ఆ షాక్ లో గుండెపోటుతో మరణించినట్లు భావిస్తున్నారు. శ్రీదేవికి ఇప్పటివరకూ గుండె సంబంధ సమస్యలు ఏమీ లేవు. అయితే ప్రమాదంలో పడిపోయినప్పుడు భయంతో గుండెపోటు వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప..ఇందులో ఎలాంటి కోణాలు లేవని చెబుతున్నారు. నీటి టబ్బులో నుంచి బయటకు తీసే సమయానికే శరీరం కొంత ఉబ్బిపోయి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు దుబాయ్‌ పోలీసులు శ్రీదేవి కుటుంబ సభ్యులకు శవ పరీక్ష నివేదికను అప్పగించారు.

పోలీసుల నివేదిక ప్రకారం శనివారం సాయంత్రం పార్టీ నుంచి హోటల్‌లో గదికి వెళ్లిన శ్రీదేవి 7గంటల ప్రాంతంలో బాత్‌రూమ్‌కు వెళ్లారు. ఆ సమయంలోనే ప్రమాదవశాత్తు కాలు జారీ నీళ్ల టబ్‌లో పడిపోయారు. దీంతో ఆమె తీవ్ర కంగారుకు లోనై గుండెపోటు వచ్చి టబ్‌లో నుంచి పైకి లేవలేక, ఊపిరి ఆడక ఆమె తుది శ్వాస విడిచినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటికే ఆమె భర్త బోనీ కపూర్‌ హోటల్‌ గదికి వచ్చారు. ఎంత కొట్టి చూసినా శ్రీదేవి బాత్‌ రూం తలుపులు తీయకపోవడంతో హోటల్‌ సిబ్బంది సాయంతో తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాపేసట్లో ప్రత్యేక జెట్‌ విమానంలో ఆమె మృతదేహాన్ని తరలించనున్నారు. అయితే ముందు ప్రకటించినట్లుగా సోమవారం నాడు కాకుండా..మంగళవారం నాడు శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Next Story
Share it