Telugu Gateway
Politics

చంద్రబాబును ‘ఫిక్స్’ చేసిన బిజెపి

చంద్రబాబును ‘ఫిక్స్’ చేసిన బిజెపి
X

తెలుగుదేశం, బిజెపిల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. ఏపీ ప్రజలు..మీడియా ప్రశ్నించాల్సింది బిజెపిని కాదు..చంద్రబాబును అని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ‘ప్రత్యేక హోదా’ పేరెత్తితే జైల్లో పెడతా అన్న చంద్రబాబు..ఇప్పుడు ఎందుకు అదే పాట పాడుతున్నారని ప్రశ్నించారు. హోదా వల్ల 3000 కోట్ల రూపాయలకు మించి రావని చెప్పింది చంద్రబాబే కదా?. హోదా పొందిన రాష్ట్రాలు ఏమి లాభపడ్డాయని ప్రశ్నించింది ఆయనే కదా?. ఇవన్నీ మీరు అడగాల్సింది చంద్రబాబునే. కేంద్రం ఇంతకంటే ఎక్కువ ఏమి ఇస్తుంది అన్నది ఆయనే కదా?.ఎవరూ సాధించలేనంత ఏపీ సాధించింది చెప్పింది కూడా చంద్రబాబే కదా?. ఈ ప్రశ్నలను బిజెపిని కాదు మీరు అడగాల్సింది. ముఖ్యమంత్రి చంద్రబాబును పిలిచి మీడియా ఈ ప్రశ్నలు అడగాలి అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అమరావతి శంకుస్థాపన సమయంలో మంత్రులందరితో పవిత్ర జలాలు తెప్పించి..అదే ప్రధాని మోడీ ఇస్తే మట్టి అంటారా?. మోడీ అవి తెచ్చినప్పుడు మీకు బాగా కనెక్ట్ అయ్యారు కదా?. ఆనందభాష్పాలు రాల్చారు కదా?. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు. లక్ష కోట్ల రూపాయలు ఇస్తామని మోడీ ఎక్కడైనా చెప్పారా?. అంటూ వీర్రాజు ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో సోము వీర్రాజు మాట్లాడాతూ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను మీడియాకు చూపించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా విశ్వసించింది. కానీ, ఇప్పుడు జైలుకు ఎవరు వెళ్లాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ధర్మయుద్ధం జరుగుతుంది. మీ కాళ్ళకు మొక్కుతున్నాను.. ఈ విషయాలపై మీడియా మిత్రులు సీఎం చంద్రబాబును ప్రశ్నించండి. హోదాతో ఒరిగేదేం లేదని, మనమే ఎక్కువ సాధించాంమని, ఏ రాష్ట్రానికైనా ఎక్కువ వచ్చాయా అని చంద్రబాబు అన్నారు. ఇవన్నీ కూడా ఈనాడులో వచ్చిన కథనాలే. ఆధారాలుంటే రండి చెప్పండి అని అన్నార. ప్యాకేజీకి చట్టబద్ధత వచ్చిందని, దానికి కేబినెట్‌ తీర్మానం చేశారు. ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేశారు. త్రికరణ శుద్ధిగా చంద్రబాబు చెప్పిన మాటలు సత్యాలు అని నమ్మాం. ఈ విషయాలు అడగాల్సిన ధర్మం మీడియా మిత్రులకు ఉంది. ఎవరైనా ఆందోళన చేస్తే చట్టం తన పనితాను చేస్తుంది అన్నారు. ఇప్పుడు ఆందోళన చేస్తుంది చంద్రబాబే.

చంద్రబాబుకు ఆ చట్టం వర్తించదా. తేదీల వారిగా ఆయన ఏమేం చెప్పారో అవన్నీ ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎనిమిది ప్రకటనలు చేశారు. సుజనా చౌదరి కూడా కేంద్రం అన్ని ఇచ్చింది.. ఇంతకంటే ఎక్కువగా కేంద్రాన్ని అడగలేం. ఈ వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ప్రత్యేక హోదాకు రాయితీలకు సంబంధం లేదు.. ఒక వేళ ఇచ్చినా ఈ ఏడాది మార్చి వరకే ఉంటుందని సుజనా చౌదరీ చెప్పారు.. మీడియా ఈ విషయాలపై కూడా వారినే ప్రశ్నించాలి.10.9.2016న వార్త ప్రకారం హోదాకు సమానంగా ఇచ్చిన ప్యాకేజీ తీసుకోవద్దా.. ప్రతిపక్షాల నిరసనలకు ప్రజలు సహకరించవద్దు అని చంద్రబాబు అన్నారు. పోలవరం 2018నాటికే పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ప్యాకేజీపై అసెంబ్లీలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం చేశారు. ఒక్కసారిగా ఇప్పుడు చంద్రబాబు వైఖరిలో ఎందుకింత మార్పు వచ్చింది. హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని స్వయంగా చంద్రబాబే చెప్పారు. ఈ విషయాలు అన్ని కూడా అసెంబ్లీలో, బయటా మాట్లాడారు' అని తెలిపారు. మొత్తానికి సోము వీర్రాజు ఏపీ సీఎం చంద్రబాబును తనదైన శైలిలో ఫిక్స్ చేశారు. బిజెపి ఏపీకి హ్యాండ్ ఇచ్చింది అన్నది ఎంత నిజమో...చంద్రబాబు రకరకాల మాటలు మాట్లాడింది కూడా అంతే నిజం.

Next Story
Share it