Telugu Gateway
Cinema

సమంత హాట్ ఫోజు..హల్ చల్

సమంత హాట్ ఫోజు..హల్ చల్
X

సమంత హాట్ ఫోజు ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదీ బికినీలో. పెళ్ళైన తర్వాత సమంత ఇంత హాట్ ఫోజు ఒకటి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయటం ఇదే మొదటిసారి. అయితే ఆమె దానికి ఓ వివరణ కూడా ఇచ్చారు. . ‘చాలా అలసిపోయాను. ఇది వెకేషన్‌ టైమ్‌. ఇది కావాలని కాదు, అవసరం’ అంటూ పేర్కొన్నారు. సమంత అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని సమంతగా మారిన విషయం తెలిసిందే. ఆమె మొదటి నుంచి పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని ప్రకటించారు.

ఆమె చెప్పినట్లుగానే పెళ్లి తర్వాత నటిస్తున్నా కూడా ఆమె అవకాశాలు అలా వచ్చిపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ‘రంగస్థలం’, ‘మహానటి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సమంత ఇటీవల కాస్త తీరికదొరికిందని సమయాన్ని వృధా చేయకుండా ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. సమంత తమిళనాడులోని తెన్‌కాశీలో బికినీ వేసుకుని సేద తీరుతోన్న ఫోటోను పోస్ట్‌ చేశారు.

Next Story
Share it