Telugu Gateway
Top Stories

బాయ్ ఫ్రెండ్ ను ముక్కలు ముక్కలు నరికేసి..

బాయ్ ఫ్రెండ్ ను ముక్కలు ముక్కలు నరికేసి..
X

ఆ హత్య చూసి పోలీసులు అవాక్కు అయ్యారు. హత్య చేసిన తర్వాత నిందితురాలు చెప్పిన విషయాలు ద్రిగ్బాంతికి గురిచేసేలా ఉన్నాయి. హత్యకు కారణాలేంటే స్పష్టంగా తెలియటం లేదు కానీ..హత్య జరిగిన తీరు మాత్రం భయానకంగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్ ను అత్యంత కిరాతకంగా..ముక్కలు ముక్కలుగా నరికి చంపిన అనస్తేసియా ఒనేజినా(21)ను రష్యా పోలీసులు అరెస్టు చేశారు. బాయ్‌ ఫ్రెండ్‌ డ్మిటీ సింకీచ్‌(24)ను అనస్తేసియా హత్య చేసిన తీరు పోలీసులు కూడా కలవరపడేలా చేసింది. సింకీచ్‌ కొన్నేళ్ల పాటు పోలీసుగా పని చేసి వ్యక్తిగత కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అనస్తేసియా, సింకీచ్‌లు కొద్ది ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

వేలెంటైన్స్‌ డే సందర్భంగా సింకీచ్‌ ఇంటికి వచ్చిన అనస్తేసియా సింకీచ్‌ను కిరాతకంగా చంపింది. కిచెన్‌ కత్తితో సింకీచ్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపింది. అనంతరం బాడీ నుంచి తల, కాళ్లు, చేతులు, మర్మాంగం, చెంపలు వేరు చేసినట్లు తెలిపింది. హత్య జరిగిన ప్రదేశంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇంట్లో హుక్స్‌ కు వేలాడుతున్న సింకీచ్‌ శరీర భాగాలను చూసి కంగుతిన్నారు. ఫ్రిజ్‌లో ప్యాకెట్ల రూపంలో సింకిచ్‌ ప్రైవేట్‌ పార్ట్స్‌ ను అనస్తేసియా దాచినట్లు చెప్పారు. అనస్తేసియాకు గతంలోనే వివాహమైంది. పెళ్లైనా కొద్దిరోజులకే అనస్తేసియా భర్త అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఇప్పుడు ఆమె ఈ హత్యకు పాల్పడింది.

Next Story
Share it