Telugu Gateway
Cinema

‘పవన్’పై వర్మ పంచ్

‘పవన్’పై వర్మ పంచ్
X

నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ పై ‘పంచ్’ వేశారు. చూస్తుంటే పవన్ రాజకీయాల్లో చిరంజీవిలా మారిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయని పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ‘హైదరాబాద్‌ నోవాటెల్‌లో జనసేన పార్టీని స్థాపించిన సమయంలో పవన్‌ కళ్యాణ్‌ సింహంలా గర్జించాడనిపించింది. కానీ, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. అతనూ(పవన్‌) చిరంజీవిలా మారిపోతున్నాడేమో అనిపిస్తుంది ’ అంటూ ఓ పోస్టు చేశాడు. గత కొంత కాలంగా పవన్ ను సమర్థిస్తూ వచ్చిన ఆయన లైన్ మారుస్తూ ఈ మధ్య కాలంలో పవన్ పై మళ్ళీ సెటైర్లు వేస్తున్నాడు. మొదటి నుంచి పవన్ ఫ్యాన్స్ కు వర్మకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it