Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మియా మాల్కోవాపై వర్మ ఒట్టు

0

రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటో తెలుసా?. ఆయన ఈ ఏడాది చాలా బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉంటారట. అంతకు ముందు మరో కామెంట్ కూడా చేశారు. తనకు ప్రామిస్ లపై నిలబడే అలవాటు లేదని కూడా తేల్చిచెప్పారు. ప్రామిస్ డే రోజు డైరెక్టర్ వర్మ చేసిన ప్రామిస్‌కు అనూహ్య స్పందన వస్తోంది. సాధారణంగా దేవుడి మీద ఒట్టు, అమ్మ మీద ఒట్టు అని చెబుతుంటారు కదా.. అందుకు వర్మ కాస్త భిన్నంగా కొందరు వ్యక్తులపై ప్రామిస్ చేస్తూ చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. ప్రామిస్ డే రోజు ఓ ప్రామిస్ చేస్తున్నా… నేను ఏనాడు చేసిన మాటపై నిలబడనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోనని ప్రామిస్ చేస్తున్నానంటూ వర్మ తొలుత ఓ ట్వీట్ చేశారు.

- Advertisement -

దేవుడిపై గానీ, తన తల్లిపై గానీ తాను ఆ ప్రామిస్ చేయడం లేదన్నారు వర్మ. అందుకు బదులుగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, స్టీవెన్ స్పిల్‌బర్గ్, అయన్ ర్యాండ్, డావూద్ ఇబ్రహీం, బ్రూస్‌ లీ మరియు మియా మాల్కోవాలపై ప్రామిస్ డే రోజు ప్రామిస్ చేస్తున్నాను. ఈ ఏడాది నేను చాలా మంచి బాధ్యతాయుత వ్యక్తిగా ఉండేందుకు తీవ్రంగా కష్టపడతాను’అని ప్రకటించారు. వర్మ బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించటం జరిగే పనేనా? అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.