Telugu Gateway
Cinema

దేవుడిని ఎప్పుడూ ఇంతగా ద్వేషించలేదు

దేవుడిని ఎప్పుడూ ఇంతగా ద్వేషించలేదు
X

శ్రీదేవి మరణవార్త విన్న తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్య ఇది. అదీ ట్విట్టర్ లో. ముందు ఇదో ఫేక్ న్యూస్ అనుకున్నాడు. వరస పెట్టి ఇవే మెసేజ్ లు వస్తుండటంతో శ్రీదేవి ఇక లేరనే విషయాన్ని వర్మ జీర్ణించుకోలేకపోయారు. శ్రీదేవి గురించి వర్మపలుమార్ల బహిరంగ వేదికల్లోనే తన అభిమానాన్ని చాటుకున్నారు. కొన్నిసార్లు ఆయన వ్యాఖ్యలు వివాదం కూడా అయ్యాయి. కానీ లక్షలాది మంది అభిమానులతోపాటు వర్మ కూడా శ్రీదేవి మరణంతో తీవ్ర ద్రిగ్భాంతికి లోనయ్యాడు. ఆదివారం ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేస్తూ విచారం వ్యక్తం చేస్తున్నాడు.

శ్రీదేవితో తాను గడిపిన ప్రతిక్షణాన్ని సోషల్‌ మీడియాలో ప్రస్తావించిన వర్మ ఇక ఇదే చివరిదంటూ ఓ ట్వీట్‌ చేశాడు. ‘శ్రీదేవి గురించి ఇదే నా చివరి ట్వీట్‌.. ఇప్పటి నుంచి తను ఇంకా బ్రతికుండదనే ఊహించుకుంటాను.. శ్రీదేవిగారు, నేను మిమ్మల్ని ఇంతలా నవ్వించిన తర్వాత కూడా మీరు నన్నింతగా ఎడిపించడం అన్యాయం.. ఇంకెప్పటికీ మీతో మాట్లాడను..లైఫ్‌ లాంగ్‌ కటీఫ్‌’ అని ట్వీట్‌ చేశాడు. ఆమె మరణ వార్త విని ఇంతలా దేవుణ్ని ఎప్పుడూ ద్వేషించలేదన్న వర్మ ‘క్షణక్షణం’ సినిమా షూటింగ్‌లో ఆమెతో గడిపిన ఫొటోలను పోస్ట్‌ చేశాడు.

Next Story
Share it