Telugu Gateway
Top Stories

సుప్రీంలో ‘ప్రియా వారియర్’ పిటీషన్

సుప్రీంలో  ‘ప్రియా వారియర్’ పిటీషన్
X

ఒక్క కన్నుగీటుతో భారత్ లోని యువతను ఉర్రూతలూగించిన ప్రియా వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె ఈ వీడియో ఎంత పాపులర్ అయ్యారో అదే సమయంలో అంతే చిక్కుల్లో పడ్డారు. ‘ఒరు ఆదార్‌ లవ్‌’ సినిమాలోని పాట ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే ఆరోపణలతో పలు చోట్ల కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ సోషల్ మీడియా సెన్సేషన్, కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒరు ఆదార్‌ లవ్‌’ లోని ఓ పాటలోని వీడియో సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లో ఇటీవల పోలీస్‌ కేసు నమోదైంది. అయితే తమ మూవీ యూనిట్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అత్యవసరంగా మంగళవారం తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించే అవకాశం ఉందని ప్రియా ప్రకాశ్ ఆశిస్తోంది. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫరూక్‌ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతోపాటుగా ఈ మూవీలోని సన్నివేశాలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ మహారాష్ట్రలోనూ పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కొన్నిరోజుల కిందట దేశవ్యాప్తంగా మీడియాలో ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధానాకర్షణగా నిలిచింది.

Next Story
Share it