Telugu Gateway
Top Stories

ప్రియా వారియర్ కు సుప్రీంకోర్టులో ఊరట

ప్రియా వారియర్ కు సుప్రీంకోర్టులో ఊరట
X

యువ నటి ప్రియా వారియర్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. కన్నుగీటి దేశంలోని యువతను ఓ ఊపు ఊపిన ఈ చిన్నది అతి తక్కువ సమయంలో విపరీతమైన పాపులారిటీ పొందింది. ఆమె నటించిన సినిమాకు సంబంధించి ఓ పాట య్యూటూబ్ లో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒరు ఆదార్‌ లవ్‌’ లోని ఓ పాటలోని కొన్ని చరణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లో ఇటీవల పోలీస్‌ కేసు నమోదైంది. ఇది ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అయితే వీటిపై ప్రియావారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలో ఎక్కడా ప్రియాతోపాటు చిత్ర యూనిట్ ఎవరిపై క్రిమినల్ కేసులు దాఖలు చేయవద్దని సుప్రీంకోర్టు బుధవారం నాడు ఆదేశించింది.

దీంతో చిత్ర యూనిట్ కు ఊరట దక్కినట్లు అయింది. అదే సమయంలో తెలంగాణతో పాటు మహారాష్ట్ర సర్కార్లకు సుప్రీం ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును సుప్రీంకోర్టు బుధవారం నాడు విచారించి..మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ, మహారాష్ట్రల్లో నమోదు అయిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేశారు. సినిమా విడుదలకు ముందే సుప్రీంకోర్టులో ఊరట పొందాలని చిత్ర యూనిట్ తలంచింది. అందుకు అనుగుణంగా సుప్రీం కేసులపై స్టే విధించటంతో ప్రియా కు ఊరట లభించింది.

Next Story
Share it