Telugu Gateway
Top Stories

బడ్జెట్ లాభం వారికే

బడ్జెట్ లాభం వారికే
X

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఎక్కువ లాభపడిన వారు ఎవరైనా ఉన్నారా? అంటే వాళ్లే. ఎవరు వాళ్లు అంటారా?. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్లు. ఎందుకుంటే వీరి జీతాలు భారీగా పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు. మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐటి మినహాయింపుల జోలికిపోని జైట్లీ..వీరికి మాత్రం జీతాలు భారీగా పెంచేశారు. రాష్ట్రపతి వేతనాన్ని రూ.5 లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనాన్ని రూ.4లక్షలకు, గవర్నర్ల వేతనాలను రూ.3.5 లక్షలకు పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు.

ఇటు పార్లమెంట్‌ సభ్యుల జీతభత్యాలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెరుగుతాయని చెప్పారు.జైట్లీ ఈ మాట చెప్పినప్పుడు లోక్‌సభ చప్పట్లతో మారుమోగింది. ద్రవ్యోల్బణంగా ఆధారంగా వీరి జీతాల్లో మార్పులు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి వేతనాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.5లక్షలకు, ఉపరాష్ట్రపతి వేతనాన్ని రూ.1.30 లక్షల నుంచి రూ.4 లక్షలకు, గవర్నర్ల వేతనాన్ని రూ.1.10లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచారు. ఈ పెంపు 2018 జనవరి నుంచే వర్తిస్తుంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎంపీల జీతాలు ఆటోమెటిక్‌గా పెరుగుతాయని తెలిపారు.

Next Story
Share it