Telugu Gateway
Telangana

‘‘తమన్నా’’పై షూ

‘‘తమన్నా’’పై షూ
X

మిల్కీ బ్యూటీ తమన్నాకు షాక్. ఆమె ఏ మాత్రం ఊహించని ఘటన ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెపై ఓ వ్యక్తి బూటు విసిరేశాడు. అయితే అది ఆమెకు తగలకపోవటంతో నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు. ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది హిమాయత్‌నగర్‌లో మలబార్‌ నగల దుకాణం ప్రారంభోత్సవ సమయంలో. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై ఓ యువకుడు బూటు విసిరాడు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కరీముల్లాగా గుర్తించారు.

నగల షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన తమన్నాను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సమయంలో కొంత మంది బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఆ సమయంలోనే కరీముల్లా అనే యువకుడు తమన్నాపైకి షూ విసిరాడు. అప్రమత్తమైన పోలీసులు బూటు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై బౌన్సర్లు చేయి చేసుకున్నారు. కరీముల్లా.. ఎందుకు బూటు విసిరాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story
Share it