Telugu Gateway
Cinema

గాడ్ , సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 2కు వర్మ రెడీ

గాడ్ , సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 2కు వర్మ రెడీ
X

ఎన్ని వివాదాలు తలెత్తినా రామ్ గోపాల్ వర్మ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఆయన తన జోరును కొనసాగిస్తున్నారు. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా గాడ్‌, సెక్స్‌ అండ్ ట్రూత్‌’(జీఎస్టీ) షార్ట్ ఫిల్మ్ విజయవంతం అయిందని ప్రకటించారు. అదే ఊపులో జీఎస్టీ2కి రెడీ అయిపోతున్నట్లు వర్మ ట్విట్టర్ లో ప్రకటించారు. జీఎస్టీకి అద్భుతమైన స్పందన వస్తున్నదని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ స్పందనకు ఉబ్బితబ్బిబ్బైపోయి.. వర్మ జీఎస్టీ-2 కూడా తీయబోతున్నట్లు ప్రకటించారు.

జీఎస్టీ-2 తీయబోతున్న సందర్భంగా దేవుడు తనతో, తన జీఎస్టీ లవర్స్‌ తో ఉండాలని ఆకాంక్షించాడు. విదేశీ పోర్న్‌స్టార్‌ మియా మాల్కోవాతో తెరకెక్కించిన ఈ పెద్దల చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం అందించిన విషయం తెలిసిందే. దేశంలో సూపర్‌హిట్‌ అయిన ‘పద్మావత్‌’, ‘టైగర్‌ జిందా హై’ సినిమాలను మించి తన జీఎస్టీ ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని మరో ట్వీట్‌ లో వర్మ పేర్కొనటం విశేషం.

Next Story
Share it