Telugu Gateway
Telangana

దావోస్ ఆహ్వానాల్లో దాగిన నిజాలేంటి!

దావోస్ ఆహ్వానాల్లో దాగిన నిజాలేంటి!
X

స్పీచ్ లు అదరగొట్టే కెటీఆర్..బెదరగొట్టే లోకేష్. ఇద్దరూ దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) సమావేశాలకు వెళుతున్నారు. ఇఫ్పటికే తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ దావోస్ సమావేశాల కోసం బయలుదేరి వెళ్లారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా దావోస్ లో జరిగే సమావేశాలకు హాజరుకానున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం డబ్ల్యుఈఎఫ్ ప్రచురించిన జాబితా చెబుతోంది. వీరితో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా హాజరుకానున్నారు. కెటీఆర్ కు ఆహ్వానం వచ్చిన సమయంలో ప్రభుత్వం ఓ రాష్ట్ర మంత్రికి దావోస్ సమావేశాలకు ఆహ్వానం రావటం విశేషం అని...తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో కెటీఆర్ పాత్రను గుర్తించే ఆహ్వానం పంపారని తెలిపారు. అది గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ అయినా..ఏ వేదిక అయినా కెటీఆర్ ప్రజంటేషన్ బాగుంటుందనే విషయం రాజకీయంగా ఆయన్ను విభేదించేవారు సైతం అంగీకరించే అంశం. అయితే ఏపీ మంత్రి నారా లోకేష్ విషయానికి వస్తే ఆయన ఏపీని ఓ దేశం చేస్తారు.....మొబైల్ డేటా వాడటానికి జీడీపీ వృద్ధికి లింక్ చేసి పొంతన లేని లెక్కలు చెబుతారు. అయినా సరే ఆయన కూడా దావోస్ సభల్లో పాల్గొననున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల నుంచి హాజరయ్యే వారిలో ఎవరికీ ప్రధాన వేదికపై జరిగే కార్యక్రమాల్లో మాట్లాడే అవకాశం లేదని దావోస్ సమావేశపు ఏజెండా చూస్తే తెలుస్తోంది. ఓ భారీ ఎగ్జిబిషన్ జరుగుతున్న సమయంలో స్టాల్ తీసుకుని తమ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవటం వంటి పనులే ఏపీ సర్కారు ఎప్పటి నుంచో చేస్తోంది. ఈ సారి కూడా అలాగే చేయటం తప్ప...తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఎవరికీ దావోస్ లో ప్రత్యేక గుర్తింపు...ప్రసంగాలకు ఛాన్స్ ఏమీలేదని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. దావోస్ సమావేశాలకు ఆహ్వానం ఓ పెద్ద విషయం కాదని..సీఐఐ వంటి సంస్థలతో లాబీయింగ్ నిర్వహించే వారికి ఇది చాలా సులభమైన అంశం అని చెబుతున్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జనవరి 23-26 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.

Next Story
Share it