Telugu Gateway
Top Stories

దుమారం రేపుతున్న ‘వర్మ’ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్

దుమారం రేపుతున్న ‘వర్మ’ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్
X

రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా వివాదమే. అయితే ఈ సారి వివాదం మాత్రం పీక్ కు వెళ్లింది. ఆయన తెరకెక్కించిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ షార్ట్ ఫిలిం పెద్ద దుమారమే రేపుతోంది. వాస్తవానికి ఈ షార్ట్ ఫిలింను జనవరి 26న విడుదల చేయగా..ట్రాఫిక్ ను తట్టుకోలేక సైట్ క్రాష్ అయింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సారి అంటే శనివారం ఉదయమే షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. ఓ వైపు తన కథను వర్మ కాపీ కొట్టాడని జయకుమార్ అనే యువకుడు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు మహిళా సంఘాలు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. వర్మపై చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి. అయితే వర్మ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా షార్ట్ ఫిలింను తాజాగా అప్ లోడ్ చేశామని..ఇది చూసిన ఓ మహిళ పెట్టిన మెసేజ్ ఏంటో చూడండి అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. అదేంటో మీరూ చూడండి. ‘గాడ్‌ సెక్స్‌ అండ్ ట్రూత్ చూసిన తరువాత ఓ మహిళ నాకు మేసేజ్‌ చేసింది. ప్రతీ సీన్‌ నాకు వణుకు తెప్పించింది. ఇది పోర్న్‌ కాదు. కేవలం ఫిలాసఫీ మాత్రమే కాదు. శృంగారం పట్ల ఓ పవిత్ర భావన, స్త్రీ శరీరం పట్ల ఆరాధన. ఈ సినిమాను ప్రతీ మహిళ గౌరవంగా భావించాలి’.

‘గాడ్, సెక్స్‌ అండ్ ట్రూత్‌ చూసిన తరువాత ఓ అమ్మాయి మెసేజ్‌ చేస్తూ, సాంఘిక కట్టుబాట్ల వల్ల నేను అణచివేయబడ్డాను. జీఎస్టీ చూసిన తరువాత నేను స్త్రీగా జన్మించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్త్రీ లైంగిక స్వేచ్ఛ పట్ల మీరు చూపించిన ఫిలాసఫీ నచ్చింది. ఈ వీడియో నా సెక్సువల్‌ రైట్స్‌ గురించి ఆలోచించేలా చేసింది. మియా మాల్కోవా, ఆర్జీవీలకు కృతజ్ఞతలు’ అంటూ తనకు మెసేజ్‌ చేసినట్టుగా వర్మ వెల్లడించారు. అయితే ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇధే హాట్ టాపిక్ గా మారింది. విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తుంటే...ఈ షార్ట్ పిల్మ్ ను చూసేవాళ్లు తమ పని తాము చేసుకుంటున్నారు.

Next Story
Share it