Telugu Gateway
Movie reviews

‘భాగమతి’ మూవీ రివ్యూ

‘భాగమతి’ మూవీ రివ్యూ
X

అనుష్క. టాలీవుడ్ లో టాప్ హీరోలకు ఎంత ఇమేజ్ ఉందో అనుష్కకు కూడా అంత ఇమేజ్ ఉందనటంలో సందేహం లేదు. భాగమతి సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఐమ్యాక్స్ లో ప్రేక్షకుల సందడి చూస్తే కూడా ఈ విషయం అర్థం అవుతుంది. బాహుబలి 2 తర్వాత అనుష్క చేసిన సినిమా ఇదే కావటంతో అనుష్క అభిమానుల్లో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అనుష్క కీలక పాత్ర పోషించిన ‘భాగమతి’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చంది. మరి భాగమతి సినిమాతో అనుష్క విఝయాన్ని అందుకుందా లేదో ఓ లుక్కేయండి. ఇక అసలు కథ విషయానికి వస్తే ప్రజల్లో ఎంతో మంచి పేరున్న మంత్రి ఈశ్వర ప్రసాద్ (జయరామ్) దగ్గర ఐఏఎస్ అధికారి అయిన చంచల (అనుష్క) ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తుంది. మంత్రి ఏ మాత్రం అవినీతిని సహించని వ్యక్తిగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. అధికారుల్లోనూ అదే అభిప్రాయం ఉంటుంది.

పార్టీలోని వ్యక్తులే ఈశ్వరప్రసాద్ ఇమేజ్ దెబ్బతీసి ఆయనపై కేసులు పెట్టేలా సీబీఐని పురికొల్పుతారు. అయితే చంచల మాత్రం ఆయనకు చేదోడువాదోడుగా ఉంటుంది. మంత్రి చేపట్టిన ఓ భారీ సాగునీటి ప్రాజెక్టు విషయంలో అవసరమైన భూ సేకరణకు ఆ గ్రామాల్లో మంచిపేరున్న శక్తి (ఉన్నికృష్ణన్) చంచలకు సహకరిస్తాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఓ దశలో చంచలే శక్తిని హత్య చేయాల్సి వస్తుంది. ఐఏఎస్ అధికారిణిగా ఉన్న చంచల భాగమతిగా ఎందుకు మారింది. శక్తిని ఆమె ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది. హత్య కేసులో జైలులో ఉన్న చంచల భాగమతిగా ఎలా మారింది అన్నది వెండితెరపై చూడాల్సిందే.

ఇక పాత్రల విషయానికి వస్తే ఈ సినిమాలో అనుష్క మరోసారి తన నట విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో అనుష్క యాక్టింగ్ అరుంథతి సినిమాను గుర్తుచేస్తుంది. సెకండాఫ్ లోనూ సినిమా కథ అంతా అనుష్క చుట్టూనే తిరుగుతుంది. అనుష్క తర్వాత మరో కీలక పాత్ర అంటే జయరామ్ దే. ప్రజల్లో మంచి మనిషిగా ఉంటూ వచ్చి..చివర్లో అసలు రూపం చూపించే పాత్రలో జయరామ్ పర్పెక్ట్ గా సెట్ అయ్యారు. సీబీఐ అధికారిగా ఆషాశరత్ రోల్ ఈ సినిమాలో కీలకంగా ఉంది. ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ, ప్రభాస్ శ్రీను, ధనరాజ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. భాగమతి సినిమా డైరక్టర్ జి. అశోక్ కథలో ట్విస్ట్ లను ఆసక్తికరంగా మలచి..ప్రేక్షకుల్లో టెన్షన్ కొనసాగేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు పర్పెక్ట్ గా సెట్ అయింది. భాగమతి బంగ్లాల్లో వచ్చే సీన్లు పలుమార్లు ప్రేక్షకులను కూడా భయపెడతాయి. మొత్తానికి భాగమతి సినిమా హీరో అనుష్కనే.

రేటింగ్. 3.25/5

Next Story
Share it