Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మహేష్ ఫస్ట్ లుక్ వస్తోంది

0

మహేష్ బాబు కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ నెల 26న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమా వేసవిలో సందడి చేయటానికి రెడీ అవుతోంది. అయితే జనవరి 26న ఫస్ట్ లుక్ ఉంటుందని చెబుతూ చిత్ర యూనిట్ ఓ వినూత్నమైన పోస్టర్ ను విడుదల చేసింది. అందులో ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకార సమయంలో చదివే ప్రమాణపత్రంలోని అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సీఎం పాత్ర పోషిస్తున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

గతంలో లీక్ అయిన చిత్రాలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి కూడా. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నఈ సినిమాలో బాలీవుడ్ నటి కైరా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. జనవరి నెలాఖరులోగా ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. పాటలు చిత్రీకరణ కూడా పూర్తి చేస్తే సినిమా షూటింగ్ పూర్తవుతుందని చెబుతున్నారు. గత మహేష్ బాబు చిత్రాలు నిరాశపర్చటంతోపాటు..ఈ హీరో కూడా కొత్త చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. పైగా కొరటాల, మహేష్ బాబుది హిట్ కాంబినేషన్ కావటంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.