Telugu Gateway
Telugu

విశాల్ కు షాక్ ల మీద షాక్ లు

తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఎన్నో సంచనాలకు కేంద్రం అవుతుంది. హీరో విశాల్ కు షాక్ మీద షాక్ లు తగిలాయి. విశాల్ నామినేషన్ ఎన్నో మలుపులకు కారణమైంది. తొలుత హీరో విశాల్ నామినేషన్ ను తిరస్కరించినట్లు ప్రకటించిన అధికారి...రాత్రికి మళ్లీ నామినేషన్ ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. కానీ మళ్ళీ అర్థరాత్రి తూచ్...నామినేషన్ చెల్లదు అని తేల్చారు. ఇదంతా సినిమా తరహాలో సస్పెన్స్ డ్రామాగా సాగింది. తొలుత విశాల్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. విశాల్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైందన్న వార్తతో తొలుత కలకలం రేగింది. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికపై రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థులకు వరస పెట్టి షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్‌ నామినేషన్‌ను కూడా తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయం మరో మలుపు తిరిగినట్లు అయింది. నామినేషనల్‌ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పేర్కొన్నారు. స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అంతకు ముందు జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారి తెలిపారు. నామినేషన్‌ తిరస్కరణపై విశాల్‌ తీవ్రంగా స్పందించాడు. ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారంటూ రోడ్డుపై ధర్నాకు దిగగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ ​ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయమై విశాల్‌ కోర్టుకు వెళ్లే ఆలోచన కూడా చేశారు. చివరకు విశాల్ నామినేషన్ ఆమోదించటంతో ఉద్రిక్తతకు తెరపడింది అనుకున్న సమయంలో ఈ వ్యవవహారం మరో మలుపు తిరిగింది. మళ్ళీ నామినేషన్ తూచ్అని ప్రకటించారు. విశాల్ ఈ పరిణామంపై కో్ర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.

Next Story
Share it