Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

నాని ‘ఎంసీఏ’ సెన్సార్ పూర్తి

0

వరస హిట్లతో దూసుకెళుతున్న నాని మరో హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడా?.అంటే అవునంటున్నాయి ఎంసీఏ చిత్ర వర్గాలు. ఎందుకంటే నాని హీరోగా నటించిన ఎంసీఏ..మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అంతే కాదు  ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నానికి జోడీగా ఫిదా ఫేం సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.

- Advertisement -

వీళ్లిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు మరింత పెరిగిన సంగతి తెలిసిందే. ఎంసీఏ సినిమాకు  వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే  విడుదలైన ఆడియోతో పాటు టీజర్, ట్రైలర్ లకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు సెన్సార్ సభ్యులు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటించింది.

 

 

 

Leave A Reply

Your email address will not be published.