Telugu Gateway
Andhra Pradesh

సోషల్ మీడియా ఎఫెక్ట్..ఏపీలో టీచర్ సస్పెండ్

ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే కారణంగా తెలంగాణలో ఓ ఆర్టీసి కండక్టర్ ను సస్పెండ్ చేయగా..ఇప్పడు అచ్చం ఏపీలోనూ అలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వానికి విమర్శించటంతోపాటు, రాజకీయ పార్టీలపై అభ్యంతరకర భాషలో సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టినందుకు మంచిమ్ శెట్టి శ్రీనివాస్ అనే స్పెషల్ గ్రేడ్ టీచర్ (ఎస్ జీటీ)ని సస్సెండ్ చేశారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

మంచిమ్ శెట్టి శ్రీనివాస్ కొవ్వూరు మండలంలో బంగారంపేట మండలిప్రజా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991లోని నిబంధనల ప్రకారం ఈ సస్పెండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులకు లైక్ లు కొట్టడంతోపాటు..షేర్ చేసినందుకు ఈ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. కొవ్వూరుకు చెందిన మండల విద్యా అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.

Next Story
Share it