Telugu Gateway
Telangana

నయం..ఇవాంకకు ఆ విషయం తెలియదు

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలే ఫస్ట్ అనే కాన్సెప్ట్ తో హైదరాబాద్ లో వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో గ్లోబర్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ హాజరయ్యారు. ప్రధాని మోడీతోపాటు ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఆయన తనయుడు కెటీఆర్ లు పాల్గొన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పంచ్ లు వేశారు. ‘ఇవాంకకు ఆ సంగతి తెలియదు. లేకపోతే కెటీఆర్ ను ఆ ప్రశ్న అడిగేదే’ అంటూ వ్యాఖ్యానించారు. అసలు కెసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళ కూడా లేని విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకునే విహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అసలు మంత్రి కెటీఆర్ ఏ హోదాలో ప్రధాని పక్కన కూర్చున్నారని విహెచ్ ప్రశ్నించారు. నగరానికి ప్రధాని వచ్చినప్పుడు ప్రథమ పౌరుడైన మేయర్ స్వాగతం పలకటం ఆనవాయితీ అని..అయితే ఈ సారి మేయర్ ఎక్కడా కన్పించలేదన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళ లేరు కానీ..కెటీఆర్ జీఈఎస్ లో మహిళా సాధికారికతపై మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు అందరూ ఇప్పుడు కేబినెట్ లో మహిళలకు చోటులేని అంశాన్ని హైలెట్ చేసి మాట్లాడుతున్నారు. కెటీఆర్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.

.

Next Story
Share it