Telugu Gateway
Telangana

‘ఇవాంకా’పై వర్మ వివాదస్పద వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని..తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఈ సదస్సు కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న తరుణంలో వర్మ వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు( ఐఈఎస్) ఇవాంకా సారధ్యంలోనే అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్తల బృందం రానుంది. దీని కోసం నగరంలో భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఆమె పర్యటనపై వర్మ ఏమన్నారో మీరే చూడండి. ‘నాకు ఏ మాత్రం రాజకీయ అవగాహన లేదు. ఇవాంక హైదరాబాద్‌లో ఎందుకు పర్యటిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆమె అందాన్ని చూడటానికి మాత్రం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. గతంలో సన్నీ లియోనీ ఇండియాకు వచ్చినప్పడు ఎంత ఎగ్జయిట్‌ అయ్యానో.. ఇప్పుడూ అంతే ఆత్రుతతో ఉన్నా ’ అని వర్మ తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఇవాంకను బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌తో పోలుస్తూ వర్మ చేసిన ఈ పోస్ట్‌ వైరల్ అవుతోంది.

Next Story
Share it