Telugu Gateway
Telangana

మేం అనుకున్నట్లే చేస్తాం..ప్రజలు మాకు అధికారం ఇచ్చారు

ఇది అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్యలు. ‘ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మాకు నచ్చినట్లే చేస్తాం. మీరు ఉంటే..మేం చెపితే వింటారా?. కొత్త సచివాలయం, అసెంబ్లీ, హెచ్ వోడీలు కట్టితీరతాం. ఆపే ప్రశ్నేలేదు. 151 ఎకరాల్లో ఈ భవనాలు వస్తాయి. సచివాలయానికి మహా అయితే ఎంత అవుతుంది. ఓ 280 కోట్ల రూపాయలు కావచ్చు. ఈ మాత్రం ఖర్చుపెట్టలేనంత స్థితిలో తెలంగాణ ఉందా?. మొత్తం భవనాలకు ఓ ఐదు వందల కోట్ల రూపాయలు కావొచ్చు. దేశంలోని అత్యంత కీలకమైన మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ నగరం తెలంగాణలో ఉండటం మన అదృష్టం. ఇక్కడ మంచి భవనాలు కట్టుకుంటే తప్పేంటి?. కర్ణాటకలో విధానసౌధ బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ నేను కూడా ఫోటో దిగా. ఎవరైనా దిగుతారు. అలా ఉంటది ఆ భవనం. అసెంబ్లీ నుంచి మండలికి ఎలా పోవాలి. స్పీకర్..ఛైర్మన్ కార్లు ఎండలో ఉంటాయి. పార్కింగ్ ఎక్కడుంది. ఎవరెన్ని చెప్పినా సరే కొత్త భవనాలు కట్టి తీరతాం. ప్రజలకు అన్ని విషయాలు వివరించి చెబుతాం. అసెంబ్లీ భవనం ఎలా ఉంది?. ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా ఇక్కడ?. ’ అని ప్రశ్నించారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జాప్యం అవుద్ది అందరికీ భోజనాలు పెట్టాలి అంటే...అలాంటి సౌకర్యమే లేదు..సచివాలయంలో. మారియట్ హోటల్ కు పోయి తినొచ్చాం. అదీ పరిస్థితి.

భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న సచివాలయాల్లో మనదే చెత్త సచివాలయం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సచివాలయంలోని ఏ ఒక్క భవనం కూడా నిబంధనలకు అనుకూలంగా లేవు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ కూడా అధ్వానంగా ఉంది. అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక యంత్రాలు వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలం గొప్ప సూచికగా ఉండాలి. అందుకే కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ అన్నారు. ప్రధాని మోడీకి కూడా కొత్త సచివాలయం గురించి చెప్పానని కెసీఆర్ అన్నారు. ఏ రాష్ట్రంలో అయినా సచివాలయం, అసెంబ్లీ భవనాలు ప్రత్యేకంగా ఉండే తప్పేమీలేదన్నారు.

Next Story
Share it