Telugu Gateway
Cinema

జైసింహ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

బాల‌కృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జైసింహ సినిమా ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. ఇది బాల‌య్య 102 సినిమా అన్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ లుక్ లో బాల‌య్య చేతిలో ఓ మంచి స్టిక్ ప‌ట్టుకుని సీరియ‌స్ లుక్ లో క‌న్పిస్తారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు 'జై సింహా' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సి కళ్యాణ్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది.

బుధవారం సాయంత్రం ఐదు గంట‌ల స‌మ‌యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‎లుక్ విడుదల చేశారు యూనిట్ సభ్యులు. ఈ ఫస్ట్‎లుక్ పోస్టర్ లో బాలయ్య తన లుక్ తో అదరగొట్టేస్తున్నాడు. పోస్టర్ లో బాలయ్య వెన‌క ఎన్టీఆర్ విగ్రహం ఉండ‌టం విశేషం. ఈ సినిమా త‌ర్వాత తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బాల‌య్య న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it